సీఎం కేసీఆర్ ను కలిసిన నూతన డీజీపీ అంజనీ కుమార్
- December 31, 2022
హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీ అంజనీ కుమార్ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు డీజీపీగా అవకాశం కల్పించినందుకు సీఎం కెసిఆర్‌కు డీజీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు సీఎం కెసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, తెలంగాణ నూతన డీజీపీగా అంజనీ కుమార్ శనివారం మధ్యాహ్నాం బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీలు సీవీ ఆనంద్, మహేశ్ భగవత్‌తో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంజనీ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ ఉదయం తెలంగాణ స్టేట్ పోలీసు అకాడమీలో మహేందర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్
- ఈ నెల 20 వరకు హజ్ యాత్ర
- అరేబియా సముద్రంలో అమెరికా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్‌పాట్ గెలిచిన రెండవ విజేత..!!







