నాగ చైతన్య మాస్ ప్రయత్నం.! ఈ సారైనా ఫలిస్తుందా.?
- January 02, 2023
మాస్ హీరో అనిపించుకోవాలని, గతంలో పలు మార్లు ప్రయత్నించాడు అక్కినేని నాగ చైతన్య. కానీ, ఎందుకో మాస్ చైతూకీ వర్కవుట్ కాలేదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే వున్నాడు.
ఈ సారి తిమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ సినిమాతో రాబోతున్నాడు చైతూ. ఫస్ట్ లుక్‌తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేశాడు. ఇప్పుడు గ్లింప్స్ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేసి, ఆ అంచనాల్ని రెట్టింపు చేశాడు చైతూ. లాంగ్ వ్యూ కట్స్, రోడ్డుపై కార్ల ఛేజింగ్.. ఇలా పవర్ ఫుల్ కటింగ్స్‌తో ఈ గ్లింప్స్ కట్ చేశారు.
చైతూ క్యారెక్టర్ ఇంట్రోని ఈ గ్లింప్స్‌లో చూపించారు. అది వెరీ ఇంట్రెస్టింగ్. ఏది ఏమైనా ఈ సారి చైతూ మాస్ ప్రయత్నం ఫలించేలాగే అనిపిస్తోంది. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌తో ఇంతలా అంచనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఇక, టీజర్, ట్రైలర్ నెక్స్‌ట్ లెవల్ వుండొచ్చని అక్కినేని అభిమానులు ఓ అంచనాకి వచ్చేవారు.
కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా, ఆయన తనయుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







