ఎన్టీయార్ 30.! కాస్త కొత్తగా ట్రై చేశాడు.!
- January 02, 2023
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత కొరటాల శివతో ఎన్టీయార్ సినిమా కన్ఫామ్ చేసి చాలా కాలమే అవుతోంది. ఇదిగో అదిగో అంటున్నారు. కానీ, ఆ సినిమా ఇంతవరకూ పట్టాలెక్కింది లేదు.
ఇక కొత్త సంవత్సరం మొదటి నెలలలో ఎలాగైనా సినిమా సెట్స్ మీదికెళుతుందని తాజా ఖబర్. అందుకు సాక్ష్యంగా న్యూ ఇయర్ స్పెషల్‌కి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌లో హుషారు తెప్పించారు.
అంతేకాదండోయ్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటుంది. సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కానుందని తాజాగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే, వచ్చే నెల నుంచి సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయనున్నట్లు కూడా తెలుస్తోంది.
లేట్ అయినా లేటెస్టుగా సినిమాని కంప్లీట్ చేసేయనున్నారట కొరటాల అండ్ టీమ్. స్ర్కిప్టు విషయంలో అంతా పక్కాగా వున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు.
అయితే, సినిమా రిలీజ్ డేట్ లాకింగ్ నేపథ్యంలో ఒకింత వింత కామెంట్లు వైరల్ అవుతున్నాయ్. ఆలు లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంటారుగా.. అలా సినిమా ఇంకా పట్టాలే ఎక్కలేదు కానీ, రిలీజ్ డేట్ మాత్రం వదిలేశారంటూ నెట్టింట కామెంట్లు నెక్స్ట్ లెవల్లో వినిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







