వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి
- January 02, 2023
హైదరాబాద్: వాల్తేర్ వీరయ్య సెన్సార్ పూర్తి అయినట్లు తెలుస్తుంది. గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
ప్రస్తుతం చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు.ఇప్పటి వరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఒక్కోటి ఒక్కో రేంజ్ లో ఉండగా..అసలు సిసలైన ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. సినిమా చూసిన మేకర్స్ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు సమాచారం.దీనిపై రేపు అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







