4 ప్రపంచ రికార్డులను బద్దలుకొట్టిన అబుధాబి వేడుకలు
- January 03, 2023
యూఏఈ: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా నిర్వహించిన షేక్ జాయెద్ ఫెస్టివల్ నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను బద్దలు కొట్టింది. అతిపెద్ద బాణసంచా, డ్రోన్ ప్రదర్శనతో 2023 నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. షేక్ జాయెద్ ఫెస్టివల్ మైదానం అద్భుతమైన డ్రోన్, బాణసంచా ప్రదర్శనలకు ప్రేక్షకులు పోటెత్తారు. మొదటిసారిగా సుమారు 60 నిమిషాల పాటు కొనసాగిన వేడుక గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదైంది. అతిపెద్ద బాణసంచా ప్రదర్శన 40 నిమిషాలకు పైగా కొనసాగింది. 3,000 కంటే ఎక్కువ డ్రోన్‌లు వివిధ రంగులలో కాంతి, నిర్మాణంలో అల్ వత్బా ఆకాశంలో సందడి చేశాయి. షేక్ జాయెద్ ఫెస్టివల్ నాలుగు రికార్డులను బద్దలు కొట్టగలిగిందని, వాటిలో మూడు బాణసంచా ప్రదర్శనకు సంబంధించినవని, అద్భుతమైన డ్రోన్ షో ద్వారా కొత్త రికార్డు సృష్టించబడిందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ అల్ వలీద్ ఉస్మాన్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







