అపార్ట్మెంట్లోకి చొరబడి dh1.1 మిలియన్ల చోరీ.. ఐదుగురు వ్యక్తులకు జైలుశిక్ష
- January 03, 2023
దుబాయ్: పోలీసులమని పెట్టుబడిదారుడి నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను దోచుకున్నందుకు ఐదుగురు వ్యక్తులను కోర్టు దోషులుగా నిర్ధారించింది. కోర్టు ఫైల్స్ ప్రకారం.. ఈ కేసు గత మార్చిలో నమోదైంది. పెట్టుబడిదారుడు తన నుండి, అతని బంధువు నుండి 1.1 మిలియన్ దిర్హామ్లను కొందరు వ్యక్తులు పోలీసులమని దొంగిలించారని రిపోర్టు దాఖలు చేశారు. దుండగులు అపార్ట్మెంట్లోకి ప్రవేశించి బాధితులపై దాడి చేశారు. డ్రాయర్లో ఉన్న 1.1 మిలియన్ దిర్హామ్లను తీసుకొని పారిపోయారు. దర్యాప్తు బృందం ముఠా సభ్యులను గుర్తించి, వారిలో ఒకరిని దుబాయ్ విమానాశ్రయంలో దేశం విడిచి వెళుతుండగా అరెస్టు చేసింది. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మిగతా వారిని అరెస్ట్ చేశారు. దుబాయ్ క్రిమినల్ కోర్ట్ వారందరినీ దోషులుగా నిర్ధారించింది. వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష ముగిసిన తర్వాత బహిష్కరించాలని ఆదేశించింది. అప్పీల్ కోర్టు ఈ తీర్పును సమర్థించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







