దుబాయ్ లో 7-రోజుల వెహికల్ టెస్టింగ్ సర్వీస్ ట్రయల్ ప్రారంభం
- January 03, 2023
దుబాయ్: జనవరి 8 నుండి రెండు నెలల పాటు అల్ ముతకమేలా వెహికల్స్ టెస్టింగ్ అండ్ రిజిస్ట్రేషన్ సెంటర్, తస్జీల్ యూజ్డ్ కార్ మార్కెట్ సెంటర్‌లో వారంలో ఏడు రోజులూ వెహికల్ టెస్టింగ్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. కేంద్రాలు ఆదివారం (వారాంతం) మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటాయని లైసెన్సింగ్ ఏజెన్సీ, RTA వాహనాల లైసెన్సింగ్ విభాగం డైరెక్టర్ జమాల్ అల్ సదా తెలిపారు. ఇంతకుముందు RTA దాని 28 వాహన పరీక్షా కేంద్రాలలో పని గంటలను పెంచింది. ఉదయం 7 నుండి రాత్రి 10.30 వరకు సర్వీస్ సెంటర్లు పనిచేస్తుండగా.. తస్జీల్ హట్టా సెంటర్ ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు, తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఉదయం షిఫ్ట్ ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుస్తుంది. సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 10.30 వరకు రెండో షిఫ్ట్ లో సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఇక శుక్రవారం తస్జీల్ జెబెల్ అలీ సెంటర్ ఉదయం 7 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుందని, హట్టా సెంటర్‌లో పని గంటలు సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మాత్రమే పరిమితం చేసినట్లు జమాల్ అల్ సదా తెలిపారు.
తాజా వార్తలు
- 'National Army Day' కి ఐక్యతతో నివాళులు
- క్రైస్తవుల భద్రతకు భంగం రానివ్వం: సిఎం చంద్రబాబు
- పర్యాటకుల భద్రతకు టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
- రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
- మహిళా క్రికెటర్ల ఫీజుపెంచిన BCCI
- కూలిన మెక్సికో నేవీ విమానం.. ఐదుగురు దుర్మరణం
- ముహర్రక్ నైట్స్ ఫెస్టివల్ ను సందర్శించిన విదేశాంగ మంత్రి..!!
- కువైట్లో ఇన్క్రెడిబుల్ ఇండియా టూరిజం ప్రమోషన్స్..!!
- ఇబ్రిలో స్టంట్ డ్రైవింగ్..ఎనిమిది మంది డ్రైవర్లు అరెస్ట్..!!
- జంతువులను వదిలేస్తున్నారా? కఠిన చర్యలు..!!







