హైదరాబాద్ మెట్రో టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన..
- January 03, 2023
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు టికెటింగ్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఎల్ బీ నగర్-మియాపూర్ కారిడార్ లోని 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. మెట్రో టికెటింగ్ లో సేవలు అందిస్తున్న ఉద్యోగుల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
జీతాలు పెంచాలని నిన్న సాయంత్రమే ఏజెన్సీకి ఉద్యోగులు సమాచారం ఇచ్చారు. కానీ ఇవాళ ఉదయం వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో 150 మంది మెట్రో టికెటింగ్ ఉద్యోగులు విధులకు హారు కాలేదు. దీంతో ఇతర ఉద్యోగులను కౌంటర్లతో కూర్చోబెట్టి మెట్రో అధికారులు టికెట్లు జారీ చేయిస్తున్నారు.
ఇతర ఉద్యోగులతో టికెట్లు జారీ చేయిస్తుండటంతో ఆలస్యం అవుతుంది. దీంతో టికెట్ల కోసం కొన్ని మెట్రో స్టేషన్ లలో ప్రయాణికులు బారులు తీరి కనిపిస్తున్నారు. ఎల్ బీనగర్-మియాపూర్ కారిడార్ లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు
- హాస్పిటల్లో దిగ్గజ నటుడు ధర్మేంద్ర
- నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ. 10 వేల పరిహారం: సీఎం రేవంత్
- ఆసియా కప్ ట్రోఫీపై BCCI ఆగ్రహం!
- శ్రీవారి సేవ పై టీటీడీ ఈఓ సమీక్ష
- ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
- వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్..
- భారత్-అమెరికా మధ్య కీలక ఒప్పందం
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!







