జాన్వీ కోరిక ఇప్పటికైనా నెరవేరబోతోందా.?
- January 03, 2023
‘మిలి’ సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. నార్త్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో చెలరేగిపోతున్న జాన్వీ కపూర్ సౌత్‌లోనూ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తోంది.
తనకు జూనియర్ ఎన్టీయార్ అంటే చాలా ఇష్టమని పలు మార్లు చెప్పిన జాన్వీ కపూర్, ఆయన సినిమాతోనే తెలుగులో ఎంట్రీ ఇవ్బోతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. గత కొంతకాలంగా జాన్వీ సౌత్ ఎంట్రీపై కథనాలు వస్తున్నాయ్ కానీ, అవి నిజం కాలేదు.
ఈ సారి మాత్రం కొరటాల - ఎన్టీయార్ సినిమాకి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా లాక్ చేసినట్లు ఇన్‌సైడ్ సోర్సెస్ టాక్. భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసి మరీ, జాన్వీని ఈ సినిమాకి ఫిక్స్ చేశారట.
సో, అలా జాన్వీ కోరిక నెరవేరిపోతోందన్నమాట. ఇకపోతే, ‘మిలి’ చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోనూ రిలీజ్ అయ్యింది. భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కుతోంది. జాన్వీ కపూర్ వన్ విమెన్ షోగా ఆధ్యంతం ప్రేక్షకుల్ని తన నటనతో కట్టిపడేస్తోంది ‘మిలి’గా.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







