రామ్-బోయపాటి కాంబో.! ధడ ధడలాడిపోద్ది.!
- January 03, 2023
బోయపాటి సినిమాల్లో హీరోలు చాలా ఆటిట్యూడ్‌తో వుంటారు. పక్కా మాసీ లుక్స్‌లో పవర్ ఫుల్‌గా కనిపిస్తారు. తాజాగా బోయపాటి శీను, ఇస్మార్ట్ శంకర్ రామ్‌తో సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ‘ధమాకా’ భామ శ్రీలీల, రామ్‌తో జోడీ కడుతోంది.
కాగా, ‘ది వారియర్’ సినిమాతో కాస్త డిజప్పాయింట్ చేసిన రామ్ పోతినేని, బోయపాటి సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడట. అందుకు తగ్గట్లుగానే సినిమా అవుట్ పుట్ చాలా చాలా బాగా వస్తోందట.
డిఫరెంట్ వేరియేషన్స్‌లో రామ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడనీ సమాచారం. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా రామ్ విపరీతమైన ఎనర్జీతో కనిపించబోతున్నాడట. అసలే రామ్ అంటే ఎనర్జీకి పెట్టింది పేరు. అలాంటిది ఇంతకు ముందెన్నడూ లేని విధంగా అంటే, ‘అఖండ’ రేంజ్లో ధడ ధడలాడించేయడం ఖాయమని రామ్ ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు. అన్నట్లు ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు బోయపాటి శీను.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







