ఎయిర్‌ఫోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు
- January 04, 2023
న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌ఫోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఇంజనీరింగ్ వివిధ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఖాళీల వివరాలకు సంబంధించి ఖాళీల వివరాలు జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్- సివిల్) 32 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్- ఎలక్ట్రికల్) 47 పోస్టులు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) 187 పోస్టులు , జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) 6 పోస్టులు ఉన్నాయి.
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్దులకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు ఉండాలి. విద్యార్హతల విషయానికి వస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్(ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్)పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా సంబంధిత విభాగంలో స్పెషలైజేషన్‌తో టెక్నాలజీ డిగ్రీ చేసి ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. అలాగే కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో రిజిస్ట్రరై ఉండాలి.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే గేట్ 2020 లేదా గేట్ 2021, లేదా గేట్ 2022 స్కోర్ ఆధారంగా ఎగ్జిక్యూటివ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-సివిల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజనీరింగ్-ఎలక్ట్రికల్), జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) పోస్టులకు గేట్ 2022 ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియకు చివరి గడవు జనవరి 21, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్ ; http://www.aai.aero పరిశీలించగలరు.
తాజా వార్తలు
- తెలంగాణ: మహిళలకు ‘కామన్ మొబిలిటీ’ కార్డులు
- ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..
- తిరుపతి: నూతనంగా నిర్మించిన జిల్లా పోలీసు కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఖతార్ లాజిస్టిక్స్ రంగంలో గణనీయమైన వృద్ధి..!!
- అరబ్ దేశాలలో రైస్ వినియోగంలో అట్టడుగు స్థానంలో బహ్రెయిన్..!!
- 2025లో కువైట్ క్యాబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..!!
- సౌదీ అరేబియాలో నమోదైన అత్యల్ప వింటర్ ఉష్ణోగ్రతలు..!!
- షార్జాలో గుండెపోటుతో 17 ఏళ్ల ఇండియన్ విద్యార్థిని మృతి..!!
- ఒమన్‌లో విధ్వంసం, ఆస్తి నష్టం కేసులో కార్మికులు అరెస్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం పై సీఎం చంద్రబాబు హెచ్చరిక







