అరుదైన రికార్డు సృష్టించిన జాన్వీ కపూర్ ‘మిలి’.!

- January 05, 2023 , by Maagulf
అరుదైన రికార్డు సృష్టించిన జాన్వీ కపూర్ ‘మిలి’.!

జాన్వీ కపూర్ సౌత్‌లో అడుగు పెట్టలేదు కానీ, తన నార్త్ సినిమాలతోనే సౌత్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంటోంది. భాషతో సంబంధం లేకుండా, జాన్వీ కపూర్ సినిమాలు సౌత్‌లోనూ ఆదరణ దక్కించుకుంటున్నాయ్.
ముఖ్యంగా ఓటీటీ ట్రెండ్ వచ్చాకా, అన్ని సినిమాలూ అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువవుతున్నాయ్. ఈ నేపథ్యంలో లేటెస్ట్ మూవీ ‘మిలి’ ఓటీటీలో రికార్డులు సృస్టిస్తోంది. అత్యంత ఎక్కువ ఆదరణ పొందిన సినిమాగా ‘మిలి’ ప్రత్యేక స్థానం దక్కించుకుంది.
సర్వైవల్ డ్రామాగా రూపొందిన ‘మిలి’ని అన్ని వర్గాల ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. జాన్వీ కపూర్ నటనకు ఓటీటీ ప్రేక్షక లోకం ఫిదా అయిపోయింది. ఇది మంచి శకునమే జాన్వీ కపూర్‌కి అని చెప్పొచ్చు.
త్వరలోనే జాన్వీ కపూర్ తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీయార్ 30 కోసం జాన్వీ కపూర్‌నే హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు ఇప్పటికే చూజాయగా సమాచారం అందుతోంది. తెర వెనుక గట్టిగా మంతనాలు జరుగుతున్నాయ్. అధికారిక ప్రకటన రావల్సి వుందంతే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com