పొంగల్ రేస్‌లో ఆ చిన్న సినిమా తట్టుకోగలదా.?
- January 06, 2023
ప్రతీ ఏడాదికీ పెద్ద సినిమాలతో పాటూ, ఓ చిన్న సినిమా కూడా గట్టి పోటీగా బరిలో దిగుతుంటుంది.లక్కు బాగుండి, ఏమాత్రం ఓ మోస్తరు పాజిటివ్ టాక్ వచ్చినా సరే, చిన్న సినిమా కూడా హిట్టు కొడుతుంటుంది.
ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయమిది. గతంలో శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ సినిమా అలాగే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య సినిమాలతో పోటీకి దిగి విజయం సాధించింది.
ఇప్పుడు ఆ ఛాన్స్ యంగ్ హీరో సంతోష్ శోభన్‌ని వరించింది. ‘కళ్యాణం కమనీయం’ అనే సినిమాతో సంతోష్ శోభన్ ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రియా భవానీ శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. అనిల్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజైంది.
ట్రైలర్‌కి మంచి రెస్పాన్సే వస్తోంది. ఈ రెస్పాన్స్ రిలీజ్ తర్వాత కూడా వుంటే, ఈ సినిమా సంక్రాంతి రేస్‌లో గట్టెక్కేసినట్లే. చూడాలి మరి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







