అమెజాన్ ప్రైమ్ ఫోన్స్ సేల్..

- January 06, 2023 , by Maagulf
అమెజాన్ ప్రైమ్ ఫోన్స్ సేల్..

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ప్లాట్‌ఫారమ్‌లో కొత్త సేల్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ‘Amazon Prime Phones Party Sale’ అనే పేరుతో సరికొత్త ఈవెంట్ నిర్వహిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉన్నవారికి మాత్రమే ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. అమెజాన్ నిర్వహించే ఈ స్పెషల్ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S22 , షావోమీ 12ప్రో మరిన్నింటితో సహా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల రేంజ్‌పై మరిన్ని డీల్‌లను అందిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ సేల్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కొద్ది కాలం పాటు లైవ్‌లోనే ఉంటుంది. ఈ సేల్ ఈవెంట్ జనవరి 8, 2023 వరకు కొనసాగుతుంది. HDFC బ్యాంక్ కార్డ్‌లపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. యూజర్లు అమెజాన్ వెబ్‌సైట్‌లో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా పొందవచ్చు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2023 ఫోన్ డీల్‌లలో కొన్నింటిని ఓసారి లుక్కేయండి..

అమెజాన్ అందించే ప్రైమ్ ఫోన్స్ పార్టీ సేల్ సమయంలో Snapdragon 8 Gen 1, 50-megapixel ట్రిపుల్ వెనుక కెమెరా సెటప్‌తో వచ్చిన Xiaomi 12 Pro రూ. 55,999కి అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ వెబ్‌సైట్‌లో రూ. 1,000 డిస్కౌంట్ కూపన్‌ను కలిగి ఉంది. Buy Now ఆప్షన్ క్లిక్ చేసే ముందు అప్లయ్ చేసుకోవాలి. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 8వేల వరకు డిస్కౌంట్ కూడా ఉంది. మిడ్-రేంజ్ Redmi K50i కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న యూజర్లు రూ. 22,999కి పొందవచ్చు.

రూ. 12,000 కన్నా ఎక్కువ ఖర్చు చేయలేని కస్టమర్లు రెడ్‌మి 11 ప్రైమ్‌ 5G ఫోన్ కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో ధర రూ.11,999గా ఉంది. కంపెనీ బ్యాంకు కార్డుపై రూ.1,000 అదనపు డిస్కౌంట్ ఇస్తోంది, దీని ధర రూ.10,999కి తగ్గుతుంది. శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ Galaxy S22 స్మార్ట్‌ఫోన్ మళ్లీ రూ. 52,999 డిస్కౌంట్ ధరతో పొందవచ్చు.

హై-ఎండ్ చిప్‌సెట్, 120Hz డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లేతో పాటు అద్భుతమైన కెమెరాల సెట్‌ను అందిస్తుంది. అయితే బ్యాటరీ లైఫ్ అంత మంచిది కాదు. ఈ డివైజ్ కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్‌ని కలిగి ఉంది. శాంసంగ్ భారీ బ్యాటరీలో సరిపోలేదు. 25W ఫాస్ట్ ఛార్జ్‌కు సపోర్టు అందిస్తుంది. మీరు ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి.

శాంసంగ్ Galaxy M13 రూ. 9,999కి అందుబాటులో ఉంది. వినియోగదారులు రూ. 1,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌తో మరింత తక్కువ ధరకు పొందవచ్చు. శాంసంగ్ Galaxy M33, Galaxy M32 ప్రైమ్ ధర వరుసగా రూ. 16,499, రూ. 12,499లకు అందుబాటులో ఉంది.

అమెజాన్ వివరాల ప్రకారం.. రియల్‌మి ఫోన్‌లలో కూడా డీల్స్ ఉన్నాయి. Realme Narzo 50ని రూ.10,999 ధరకే సొంతం చేసుకోవచ్చు. Realme Narzo 50 Pro అమెజాన్‌లో రూ.19,999 ధరకు అందుబాటులో ఉంది. కూపన్, బ్యాంక్ ఆఫర్‌ల ఆధారంగా అదనంగా రూ. 2వేల వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com