హనీ రోజ్.! బాలయ్య సినిమాలో ఎవరీ సీక్రెట్ నటి.?
- January 07, 2023
బాలయ్య హీరోగా ‘వీర సింహారెడ్డి’ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ‘శృతిహాసన్.’. అయితే, ఈ సినిమాకి సంబంధించి మరో నటి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె పేరు ‘హనీ రోజ్’.
పేరు భలే వుంది కదా. అమ్మడు కూడా అంతే. అందానికి అందం, అంతకు మించిన అభినయం. ఎక్కువగా మలయాళ చిత్రాల్లో నటించింది. తమిళ, కన్నడ సినిమాల్లోనూ తన సత్తా చాటింది. ఇప్పుడు తెలుగులో ‘వీర సింహారెడ్డి’తో ప్రేక్షకులకు దగ్గర కాబోతోంది.
ఆల్రెడీ ‘మనోభావాలు..’ స్పెషల్ సాంగ్ లిరికల్ వీడియోలో హనీ రోజ్ పరిచయం అయిపోయింది. అయితే, అంతకు మించి ఈమె పర్ఫామెన్స్ సినిమాలో వుంటుందట. ఆ పాత్రకు ఆమెను సెలెక్ట్ చేయడం సూపర్ అని బాలయ్య కితాబిచ్చారు. ‘భలే అమ్మాయిని పట్టారే..’ అంటూ ఆమె పాత్ర గురించి చెప్పీ చెప్పకుండానే క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు బాలయ్య.
బాలయ్య చెప్పినట్లుగానే ఆమె పాత్ర ఆడియన్స్కి నచ్చితే టాలీవుడ్లో ఆఫర్లకు కొదవేం వుండదు. అన్నట్లు హనీ రోజ్ నటించిన ‘మానిస్టర్’ అనే సినిమా ఇటీవల ఓటీటీలో రిలీజైంది. మంచు లక్ష్మి కూడా ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. ఆ రకంగా ఓటీటీ ప్రేక్షకులకు ఈ భామ సుపరిచితురాలే.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







