మళ్లీ ఛాలెంజింగ్ రోల్‌లో విక్రమ్.! హ్యాట్సాఫ్ అనాల్సిందే.!
- January 07, 2023
పాత్ర కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమయ్యే హీరోల్లో విక్రమ్ పేరు మొదటి స్థానంలో వుంటుందని చెప్పొచ్చు. పాత్ర కోసం ప్రాణం పెట్టేసే నటుడు విక్రమ్. ఎంత రిస్క్ అయినా నో చెప్పడు.
అందుకే ఆయన నుంచి ‘అపరిచితుడు’, ‘ఐ’ తదితర చిత్రాలొచ్చాయ్. తాజాగా మరోసారి విక్రమ్ ప్రయోగం చేయబోతున్నాడు. ‘కబాలి’ ఫేమ్ పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది.
ఈ సినిమాలో విక్రమ్ ఓ గిరిజన తెగ నాయకుడి పాత్రలో కనపించబోతున్నాడు. ఈ పాత్రకి సంబంధించిన మేకప్ చాలా రిస్కీ అట. దాదాపు 4 గంటల సమయం మేకప్‌కే పడుతుందట. అంతటి హెవీ మేకప్ కోసం ప్రోస్థటిక్ ప్రాసెస్ యూజ్ చేయబోతున్నారట.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా చెన్నైలో షూటింగ్ జరుపుకుంటోంది. విక్రమ్ కెరీర్‌లో ఇదో రిస్కీ అటెంప్ట్ అంటున్నారు. చూడాలి మరి, ఈ రిస్క్ విక్రమ్‌కి ఎలా కలిసొస్తుందో.!
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







