గుండెపోటుతో మరణించిన 12 ఏళ్ల బాలుడు
- January 09, 2023
కర్ణాటక: మాములుగా గుండెపోటు 50 ఏళ్లకు పైబడిన వారికీ వస్తుంటుంది. కానీ ఇటీవల కాలంలో 25 ఏళ్ల పైబడిన వారికీ సైతం వస్తుంది. ఇదే అనుకుంటే ఇప్పుడు ఆదుకునే వయసు 12 ఏళ్లకే గుండెపోటు వచ్చి మరణించిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని మడికేరి జిల్లాలోని కూడుమంగళూరుకు చెందిన మంజాచారి పాఠశాల బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కుమారుడు కీర్తన్ ఆరో తరగతి చదువుతున్నాడు.
శనివారం సాయంత్రం స్నేహితులతో ఆడుకుని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే గుండెలో నొప్పిగా ఉందని చెబుతూ తల్లడిల్లిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ అబ్బాయిని కుశాలనగర ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలుడు చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. కీర్తన్ మృతికి గుండెపోటే కారణమని నిర్దారించారు. ఈ ఘటన ఆ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అంత చిన్న వయసులో గుండెనొప్పి రావడం ఏంటి అని అంత మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్‌తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







