సౌదీలో సందడిగా 'సంక్రాంతి ప్రీమియర్ లీగ్' క్రికెట్ పోటీలు
- January 09, 2023
సౌదీ: రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం సంక్రాంతి సంబరాలు - 2023 ఆధ్వర్యంలో శుక్రవారము "సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో "రియాద్ సూపర్ కింగ్స్ (మహేంద్ర వాకాటి నాయకత్వములో )", "సంక్రాంతి సన్ రైజర్స్ (ప్రసాద్ RVP)", "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్ (హేమంత్)", "తెలుగు టైటాన్స్ - రైడర్స్ (ఇబ్రహీం షేక్)" తలపడగా.. ఫైనల్స్ కు "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్", "తెలుగు టైటాన్స్ - రైడర్స్" చేరుకున్నాయి.ఫైనల్స్ మ్యాచులో "తెలుగు టైటాన్స్ - ఫైటర్స్" విజేతగా నిలిచారు.
"సంక్రాంతి ప్రీమియర్ లీగ్ " క్రికెట్ పోటీలు విజయవంతమయ్యేందుకు సహకరించిన అన్ని జట్టుల ఆటగాళ్లకు, కుటుంబ సమేతముగా ఈ క్రికెట్ పోటీలను వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి "రియాద్ తెలుగు కుటుంబ సమ్మేళనం" కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ క్రికెట్ పోటీలకు ప్రధమ బహుమతి, ద్వితీయ బహుమతి, ట్రోఫీస్ లను "సుఖేష్, గుత్తు ఇండియన్ రెస్టారెంట్, స్వామి, బిందు భాస్కర్", ఆటగాళ్లకు బహుకరించే మెడల్స్ ను "నరేంద్ర పెళ్లూరు'' ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఈ క్రికెట్ పోటీలలో పాలుగొన్న క్రీడాకారులకు "నాగేంద్ర, ఇబ్రహీం షేక్, శేషుబాబు" స్నాక్స్, అల్పాహారం సమకూర్చారు.గెలిచిన జట్టుకు, ఆడిన ఆటగాళ్లందరికి జనవరి 13వ తేదీన నిర్వహించే సంక్రాంతి సంబరాలలో బహుమతులను అందజేయనున్నారు.




తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వాడకం పై కఠిన నిబంధనలు..
- తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు
- CBSE బోర్డ్ ఎగ్జామ్స్: ఆఖరి 3 వారాల స్మార్ట్ రివిజన్ ప్లాన్..
- మేడారంలో భక్తజన సంద్రం
- మేనేజర్ నైపుణ్యం పై ఫిర్యాదు చేయవచ్చా?
- భారత్ పై న్యూజిలాండ్ ఘన విజయం
- ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- ఫాస్టాగ్ యూజర్లకు గుడ్ న్యూస్..
- దోహా మ్యూజిక్ లవర్స్ ఆధ్వర్యంలో రిథమ్ రైజ్తో గానం & నృత్య పోటీలు
- మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు







