సెన్సార్ పూర్తి చేసుకున్న 'వీరసింహారెడ్డి'..!

- January 09, 2023 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న \'వీరసింహారెడ్డి\'..!

హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో ఈ సినిమాతో బాలయ్య బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఇప్పటికే అన్నిపనులు ముగించుకున్న ‘వీరసింహారెడ్డి’ మూవీ తాజాగా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది.

వీరసింహారెడ్డి చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ సినిమా పూర్తిగా బాలయ్య మార్క్ మూవీగా వచ్చిందని, అభిమానులకు ఈ సినిమాతో బాలయ్య కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు సెన్సార్ బోర్డు తెలిపింది. ఇక ఈ సినిమాలో బాలయ్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, ఆయన నోటివెంట వచ్చిన పలు డైలాగులు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోబోతున్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండగా, ఈ సినిమాలో అందాల భామ శ్రుతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోండగా, థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 12న బాక్సాఫస్ వద్ద భారీ స్థాయిలో రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రిజల్ట్‌ను అందిస్తారో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com