దిల్‌రాజుకు షాక్.! వెనక్కి తగ్గిన ‘వారసుడు’.!
- January 09, 2023
తెలుగులో స్ట్రెయిట్ సినిమాగా ‘వారసుడు’ సినిమాని ప్రొజెక్ట్ చేశారు దిల్ రాజు. ఎంత ప్రయత్నించినా ఆ సినిమాని స్ట్రెయిట్ తెలుగు సినిమాగా తెలుగు జనం అంగీకరించలేకపోయారు. అనవసరంగా ధియేటర్ల ఇష్యూ లేవదీసి అతి చేశారు దిల్ రాజు.
ఆయన చేసిన అతికి.. బాగా తీరిపోయిందంటూ తెలుగు సినీ జనం దిల్ రాజును దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగులో రెండు పెద్ద సినిమాలు రిలీజ్‌కి వుండగా, వాటికి పోటీగా ఓ డబ్బింగ్ సినిమాని ఎలా తీసుకొస్తారు.? అంటూ దిల్ రాజుని గత కొంతకాలంగా ఆడి పోసుకుంటున్నారు.
నిర్మాతలను చాలా ఇబ్బంది పెట్టారు దిల్ రాజు ఈ విషయంలో. అంతేకాదు, తమిళ హీరోల మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు. ఎప్పుడూ లేని విధంగా దిల్ రాజు అటు తమిళ నాట, ఇటు తెలుగు నాట కూడా బాగా కార్నర్ అయిపోయారు.
సర్ సర్లే ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా.? ఏంటీ.? దిల్ రాజుకు అలాగే అయ్యింది. జనవరి 11న ‘వారసుడు’ సినిమాని రిలీజ్ చేయాలని శత విధాలా ప్రయత్నించాడు. కానీ, కుదరనే కుదరలేదు. జనవరి 14కు ఈ సినిమాని వాయిదా వేసుకోవల్సి వచ్చింది. అన్నట్లు తమిళ వెర్షన్ మాత్రం అనుకున్న తేదీకే విడుదల కానుంది. ఇది దిల్ రాజుకు గట్టి షాకే అని చెప్పాలి.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







