భారత్ తయారీ వస్తువులను ఉపయోగించండి: నిర్మలా సీతారామన్
- January 11, 2023
న్యూఢిల్లీ: భారతీయ ప్రవాసులు దేశానికి నిజమైన రాయబారులు అని, వారు ప్రమోషన్, ఆవిష్కరణల కోసం భారతీయ ఉత్పత్తులు, సేవలను తప్పనిసరిగా ఉపయోగించాలని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. మంగళవారం ఇండోర్‌లో జరిగిన 17వ ప్రవాసీ భారతీయ దివాస్ సమావేశంలో ఆమె వర్చువల్ గా పాల్గొని మాట్లాడారు. ప్రవాసుల ఈ చొరవ వచ్చే 25 ఏళ్లపాటు భారతదేశం "ఆరోగ్యకరమైన వృద్ధి"ని సాధించడంలో సహాయపడుతుందని ఆమె అన్నారు. "మీరు భారతీయ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్నప్పటికీ, భారతీయ వ్యాపారాలతో భాగస్వామిగా ఉండమని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తద్వారా వచ్చే 25 సంవత్సరాలలో భారతదేశం మీ వద్ద ఉన్న వ్యవస్థాపక నైపుణ్యాలను స్వీకరిస్తుంది. ఇక్కడ భారతీయ వ్యాపారాలు మీతో కలిసి ప్రయోజనాన్ని పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందగల భారతదేశాన్ని నిర్మించండి” అని నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







