త్వరలోనే ఒమన్ లో యూపీఐ చెల్లింపులు
- January 13, 2023
మస్కట్: ఒమన్ తో సహా ఇతర తొమ్మిది దేశాల్లోని ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐలు) త్వరలోనే తమ అంతర్జాతీయ మొబైల్ నంబర్లను ఉపయోగించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చెల్లింపులు చేయొచ్చు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, 10 దేశాల్లోని ప్రవాస భారతీయులు (NRIలు) వారి భారతదేశ ఫోన్ నంబర్‌పై ఆధారపడకుండా లావాదేవీల కోసం UPI సేవలను యాక్సెస్ చేయవచ్చు. యూఏఐ పేమెంట్లు అందుబాటులోకి వచ్చే 10 దేశాల్లో ఒమన్, సింగపూర్, యుఎస్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, యూకే ఉన్నాయి. ఆయా దేశాలు ఏప్రిల్ 30 లోపు యూపీఏ పేమెంట్లను మొదలు పెడతాయని ఎన్పీసీఐ తెలిపింది. మరోవైపు రూపే డెబిట్ కార్డ్‌లు, తక్కువ-విలువైన BHIM-UPI లావాదేవీలను ప్రోత్సహించడానికి INR2,600 కోట్ల పథకానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ బుధవారం ఆమోదం తెలిపింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







