సౌదీ పౌరసత్వం మంజూరులో సవరణ..
- January 13, 2023
రియాద్: సౌదీ అరేబియా పౌరసత్వం మంజూరులో కొత్త సవరణను ప్రవేశ పెట్టింది.దీనిలో భాగంగా సౌదీ జాతీయత వ్యవస్థలో కీలక మార్పులు చేసింది.ఈ మేరకు జాతీయత వ్యవస్థలోని ఆర్టికల్ 8లో చేసిన సవరణను కింగ్‌డమ్‌లోని ఉన్నతాధికారులు తాజాగా ఆమోదించారు.తాజా సవరణ ప్రకారం ఇకపై పౌరసత్వం ఇచ్చే అధికారాన్ని ప్రధాన మంత్రికి ఇవ్వడం జరిగింది.ఇంతకు ముందు ఈ అధికారం దేశ అంతర్గత మంత్రికి ఉండేది. ఆర్టికల్ 8ని సవరించి ఇప్పుడు ప్రధానికి ఇచ్చారు.
ఇక సౌదీ అరేబియా జాతీయత వ్యవస్థలోని ఆర్టికల్ 8 అనేది షరతులకు లోబడి విదేశీ తండ్రి, సౌదీ తల్లికి కింగ్డమ్లో జన్మించిన వ్యక్తులకు సౌదీ పౌరసత్వం మంజూరు చేయవచ్చని చెబుతుంది. ఇలా పౌరసత్వం పొందిన వారు అక్కడి పౌర చట్టంలో పేర్కొన్న విధంగా నిర్ణీత వయసు వచ్చిన తర్వాత శాశ్వత నివాస హోదాను పొందడం జరుగుతుంది. తద్వారా ఆ దేశంలో సాధారణ పౌరులు పొందే అన్ని సేవలు వీరికి కూడా దక్కుతాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







