భారత్ లో ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్..
- January 13, 2023
భారత్ లో అమెజాన్ ఉద్యోగాల్లో భారీగా కోతలు పెడుతున్నాయి.కొత్త నియామకాలను తగ్గించడంతోపాటు కొంతమంది ఉద్యోగులను తొలిగిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇప్పటికే 10 వేల మంది ఉద్యోగులను తొలగించిన అమెజాన్ మరో 18 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
వీటిలో భారత్ కు చెందిన వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం.వీరంతా సాఫ్ట్ వేర్, హూమన్ రిసోర్స్, ఇతర విభాగాల్లో పని చేస్తున్నారని తెలుస్తోంది.జనవరి 18 తర్వాత వీరికి ఈ-మెయిల్, సామాజిక మాధ్యమాలైన లింక్ డ్ ఇన్, ట్విట్టర్ ద్వారా తొలగింపుకు సంబంధించిన సమాచారం అందించనున్నట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా తొలగించనున్న పది వేల మంది ఉద్యోగులకు 5 నెలల జీతాన్ని ముందుగానే చెల్లిస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.
వీటికి సబంధించి మరిన్ని వివరాల కోసం టీమ్ లీడర్లను కలవాలని మెయిల్స్ లో పేర్కొన్నారు.ఈ ఏడాది తమ కంపెనీలో 18 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ గతవారం ప్రకటించారు. కరోనా సమయంలో చాలా మంది ఉద్యోగులను నియమించుకున్నామని అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా వారిని కూడా తొలిగిస్తున్నట్లు పేర్కొన్నారు. అమెజాన్ స్టోర్స్ పీఎక్స్ టీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉద్యోగులను తొలగిస్తున్నామని ప్రకటించారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







