ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్
- January 13, 2023
హైదరాబాద్: జనసేన పార్టీని వీడి బిఆర్ఎస్ లో చేరిన తోట చంద్రశేఖర్..శుక్రవారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మర్యాద పూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ కూడా పాల్గొన్నారు. తోట చంద్రశేఖర్‌ను ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం పలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ రెండు, మూడుసార్లు సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
ఇదిలా ఉంటె సీఎం కేసీఆర్‌ను ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంతో కాసేపు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ రాజకీయాల గురించి ఇరువురూ చర్చించుకున్నారు. ఈ భేటీలో గిరిధర్ కుమారుడు శిశిర్ గమాంగ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!







