తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
- January 13, 2023
అమరావతి: ఏపీ సీఎం జగన్ తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పల్లెల పండుగ, రైతుల పండుగ, మన అక్కచెల్లెమ్మల పండుగ… మొత్తంగా మన సంస్కృతిని, సంప్రదాయాలను చాటిచెప్పే అచ్చ తెలుగు పండుగ అని అభివర్ణించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు జగన్ తెలిపారు. ఈ మకర సంక్రాంతి రాష్ట్ర ప్రజల జీవితాల్లో అభివృద్ధితో కూడిన మార్పును తీసుకురావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ పండుగ తెచ్చే సంబరాలతో తెలుగు లోగిళ్లలో, ప్రతి ఇంటిలోనూ ఆనందాల సిరులు వెల్లివిరియాలని అభిలషిస్తున్నట్టు సీఎం జగన్ వివరించారు.
తెలుగు ప్రజలు జరుపుకునే పండగల్లో సంక్రాంతి పండగ చాల ప్రాముఖ్యమైంది. తెలంగాణ లో కంటే ఆంధ్ర ప్రదేశ్ లో ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులతో గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు. సినీ, రాజకీయ , సామాన్య ఇలా అంత కూడా తమ ఫ్యామిలీ సభ్యులతో ఘనంగా మూడు రోజుల పాటు సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







