యూఏఈ రోడ్ల పై మారిన స్పీడ్ లిమిట్స్
- January 14, 2023
యూఏఈ: ప్రతి ఎమిరేట్‌లోని ఇంజనీర్లు సమర్పించిన ట్రాఫిక్ ఫ్లోపై సాంకేతిక నివేదికల ఆధారంగా యూఏఈ రోడ్లపై వేగ పరిమితులలో మార్పులు చేశారు. అబుధాబి మినహా అన్ని ఎమిరేట్స్‌లలో, స్పీడ్ బఫర్ వాహనదారులు నిర్ణీత వేగ పరిమితి కంటే 20kmph ఎక్కువగా ప్రయాణించడానికి అనుమతించారు. అబుధాబి 2018లో బఫర్ సిస్టమ్‌ను రద్దు చేసింది.
దుబాయ్ పోలీసులు తమ వెబ్‌సైట్‌లో వివిధ రహదారులపై వేగ పరిమితులను పొందుపరిచారు. జనవరి 13న చేసిన అప్‌డేట్ ప్రకారం.. పరిమితులు గంటకు 60 నుండి 120కిమీల వరకు ఉన్నాయి. మొహమ్మద్ బిన్ జాయెద్, ఎమిరేట్స్ రోడ్‌లలో వేగ పరిమితి గంటకు 110కిమీగా ఉండగా.. అనేక అంతర్గత రోడ్లలో ఇది గంటకు 70కిమీగా నిర్ణయించారు. దుబాయ్-హట్టా రోడ్‌లో కొంత భాగం వేగ పరిమితిని 100kmph నుండి 80kmph కు తగ్గించినట్లు , ఎమిరేట్స్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. ఈ మార్పు దుబాయ్, అజ్మాన్, అల్ హోస్న్ రౌండ్‌అబౌట్ మధ్య విస్తరించి ఉన్న సెక్టార్‌ను కవర్ చేస్తుందన్నారు.



తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







