భారతదేశం అధ్యక్షతన 'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్' నిర్వహణ

- January 14, 2023 , by Maagulf
భారతదేశం అధ్యక్షతన \'వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్\' నిర్వహణ

బహ్రెయిన్: గ్లోబల్ సౌత్ దేశాలను ఏకతాటిపైకి తీసుకురావడానికి భారతదేశం "వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమ్మిట్"ని జనవరి 12-13న "యూనిటీ ఆఫ్ వాయిస్, యూనిటీ ఆఫ్ పర్పస్" పేరుతో నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్ ఫార్మాట్‌లో జరుగుతున్న సమ్మిట్‌లో 120కి పైగా దేశాలు పాల్గొన్నాయి. జనవరి 13న "ఇంధన భద్రత మరియు అభివృద్ధి- శ్రేయస్సుకు రోడ్‌మ్యాప్" అనే థీమ్‌తో భారత ప్రభుత్వంలోని పెట్రోలియం, సహజ వాయువు & హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇంధన మంత్రుల సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సెషన్‌లో 15 దేశాల మంత్రులు పాల్గొన్నారు. G20 కింద గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్‌ను రూపొందించాలని మంత్రి ప్రతిపాదించారు. 2070 నాటికి జీరో కార్బన్ ఉద్గారాన్ని సాధించడానికి భారతదేశం నిబద్ధతను పునరుద్ఘాటించారు.  చమురు & పర్యావరణ మంత్రి మరియు వాతావరణ వ్యవహారాల ప్రత్యేక ప్రతినిధి, బహ్రెయిన్ డాక్టర్ మహమ్మద్ బిన్ ముబారక్ బిన్ డైనా ఇంధన మంత్రుల సమావేశంలో బహ్రెయిన్‌కు ప్రాతినిధ్యం వహించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com