ఖతార్ లో భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా రికార్డు పరుగు
- January 14, 2023
దోహా: మూడుసార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయిన భారతీయ అల్ట్రా రన్నర్ సుఫియా సూఫీ ఖాన్.. ఎఫ్కెటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నాన్ని జనవరి 13న విజయవంతంగా సాధించారు. 30 గంటల 34 నిమిషాల్లో ప్రో-అథ్లెట్ 'రన్ అక్రాస్ ఖతార్'లో భాగంగా తన మొదటి అంతర్జాతీయ సాహసయాత్రను పూర్తి చేసింది. 200 కి.మీ సౌత్ టు నార్త్ అల్ట్రామారథాన్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసింది. జనవరి 12 ఉదయం అబూ సమ్రా నుండి ప్రారంభమైన రన్.. జనవరి 13 మధ్యాహ్నం అల్ రువైస్లోని జులాల్ వెల్నెస్ రిసార్ట్‌లో ముగిసింది. మరొక గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టడంతోపాటు పరుగు వంటి శారీరక శ్రమల ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడంపై అవగాహన పెంచడమే తన లక్ష్యమని సుఫియా చెప్పారు. పరుగుకు ముందు ఆమె మాట్లాడుతూ.. "కాలినడకన ప్రపంచాన్ని చుట్టుముట్టడం నా కల. దానిని సాధించడానికి నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను." అని పేర్కొన్నారు.
37 ఏళ్ల సుఫియా సూఫీ ఖాన్ భారతదేశం అంతటా సుదూర పరుగు లక్ష్యాలను సాధించడంలో ప్రసిద్ధి చెందారు. 2019లో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అత్యంత వేగంగా ప్రయాణించిన మహిళగా, 2021లో గోల్డెన్ క్వాడ్రిలేటరల్ రోడ్ రన్‌ను పూర్తి చేసిన మహిళగా, 2022లో మనాలి-లేహ్ హిమాలయన్ అల్ట్రా రన్ ఛాలెంజ్‌ను కవర్ చేసిన మహిళగా ఆమె ప్రపంచ రికార్డులు సాధించింది.
Heartiest congratulations to @sufirunner for successful completion of 200 KM ultra marathaon run across Qatar and another #GWR attempt.
— India in Qatar (@IndEmbDoha) January 13, 2023
Proud of You ! pic.twitter.com/0AF5LAKX8U
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్‌లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్‌లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







