గల్ఫ్ కప్ సెమీ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన బహ్రెయిన్
- January 14, 2023
బహ్రెయిన్: 25వ అరబ్ గల్ఫ్ కప్ సెమీ-ఫైనల్‌కు డిఫెండింగ్ ఛాంపియన్స్ బహ్రెయిన్ చేరుకుంది. ఇరాక్‌లోని బాస్రా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ B చివరి గేమ్‌లో కువైట్ తో జరిగిన మ్యాచ్ 1-1 స్కోరుతో డ్రాగా నిలిచింది. ఆట మొదటి అర్ధభాగంలో బహ్రెయిన్ తరఫున మహదీ హుమైదాన్ స్కోర్ చేశాడు. అయితే విరామానికి కొద్ది క్షణాల ముందు కువైట్ తరఫున షబీబ్ అల్ ఖల్దీ గోల్ చేసి స్కోరు సమం చేశాడు. చివరి 45 నిమిషాల్లో విజేతగా నిలిచేందుకు ఇరు జట్లు తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ, మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా బహ్రెయిన్ సెమీస్ చేరింది. సోమవారం జరిగే సెమీస్ మ్యాచులలో బహ్రెయిన్ గ్రూప్-ఎ రన్నరప్ ఒమన్‌తో, ఇరాక్‌తో ఖతార్ తలపడనున్నాయి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







