దుబాయ్ లో ప్రపంచంలోనే తొలి 3డి ప్రింటింగ్ మస్జీదు నిర్మాణం

- January 14, 2023 , by Maagulf
దుబాయ్ లో ప్రపంచంలోనే తొలి 3డి ప్రింటింగ్ మస్జీదు నిర్మాణం

దుబాయ్: ప్రపంచంలోనే తొలిసారిగా 3డి ప్రింటింగ్ టెక్నాలజీతో మస్జీదును దుబాయ్ లో నిర్మిస్తున్నారు. ఇది ఒక విశిష్టమైన ప్రాజెక్ట్ అని దుబాయ్‌లోని ఇస్లామిక్ అఫైర్స్ & ఛారిటబుల్ యాక్టివిటీస్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హమద్ బిన్ అల్ షేక్ అహ్మద్ అల్ షైబానీ అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు కట్టుబడి పర్యావరణ సుస్థిరతను దృష్టిలో పెట్టుకొని మస్జీజు నిర్మారణం చేపట్టామన్నారు. ఈ నిర్మాణం ప్రపంచ కేంద్రంగా దుబాయ్ స్థానాన్ని మరింత పెంచుతుందని పేర్కొన్నారు. 3డి ప్రింటింగ్ టెక్నాలజీ అనేది 3డి ప్రింటర్‌ని ఉపయోగించి పనిని పూర్తి చేసే ప్రక్రియ అని ఇంజినీరింగ్ విభాగం అధిపతి ఇంజినీర్ అలీ అల్-హలియన్ అల్-సువైది తెలిపారు. ఇది డిజిటల్‌గా నియంత్రించబడే యంత్రం అని, ఇది ముడి , పారిశ్రామిక సంకలనాలను మిళితం చేస్తుందని వివరించారు. నిర్మాణ పనులకు అయ్యే ఖర్చు స్వల్పంగా పెరిగినా.. నిర్మాణ సమయాన్ని 3డీ టెక్నాలజీ తగ్గిస్తుందని చెప్పారు. 3డీ మస్జీదు 2023 నాల్గవ త్రైమాసికం కల్లా పూర్తి అవుతుందని తెలిపారు. ఈ మస్జీదులో దాదాపు 600 మంది ఆరాధకులు ప్రార్థనలు చేయొచ్చని, భవనం విస్తీర్ణం 2000 చదరపు అడుగులు ఉంటుందని పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com