రస్ అల్ ఖైమా నుంచి గ్లోబల్ విలేజ్‌కు బస్సు సర్వీస్ ప్రారంభం
- January 15, 2023
యూఏఈ: రస్ అల్ ఖైమా నివాసితులు పబ్లిక్ బస్సు ద్వారా నేరుగా దుబాయ్‌లోని ప్రముఖ ఫెస్టివల్ పార్క్ గ్లోబల్ విలేజ్‌కు చేరుకోవచ్చు. వన్-వే టిక్కెట్ ధర 30 దిర్హామ్ లుగా అధికారులు నిర్ణయించారు. నివాసితుల నుండి వచ్చిన డిమాండ్ మేరకు ఈ బస్సు సర్వీసును ప్రారంభించినట్లు రాస్ అల్ ఖైమా ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RAKTA), దుబాయ్, గ్లోబల్ విలేజ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) లు సంయక్త ప్రకటనలో తెలిపారు. బస్సు సర్వీస్ ప్రతి శుక్రవారం, శనివారం, ఆదివారం రెండు రౌండ్ట్రిప్లతో మాత్రమే అందుబాటులో ఉంటుంది. రస్ అల్ ఖైమా నుండి గ్లోబల్ విలేజ్‌కి మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. తిరిగి గ్లోబల్ పార్క్ నుండి తిరిగి ఎమిరేట్‌కి రాత్రి 10, 12 గంటలకు ప్రయాణం అవుతుంది. ప్రయాణీకులు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చని RAKTA క్వాలిటీ అండ్ ఆపరేషన్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ మొహమ్మద్ హషేమ్ ఎస్మాయీల్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రపంచ తెలుగు మహాసభలు..పెయింటింగ్స్‌కు ఆహ్వానం
- జేడీయూ షాక్ నిర్ణయం: 16 మంది నేతలకు బహిష్కరణ
- 3వ ప్రపంచ తెలుగు మహాసభలు–2026 ముఖ్యాంశాలు
- హరీశ్ రావు తండ్రి భౌతిక కాయానికి నివాళులర్పించిన కేసీఆర్..
- తీవ్ర తుపానుగా ‘మొంథా’.. ఏపీలో హైఅలర్ట్..
- దుబాయ్: ఏపీ మంత్రి టి.జి భరత్ తో మీట్ & గ్రీట్ ఏర్పాటు చేసిన INDEX ఎమిరేట్స్ గ్రూప్
- తెలుగు టైటాన్స్ vs పట్నా పైరేట్స్ పోరు
- యూఏఈలోని భారతీయ ప్రవాసులకు కొత్త చిప్‌తో కూడిన ఈ-పాస్‌పోర్ట్‌లు
- సౌదీలో 44 కొత్త ప్రొఫేషన్స్ లో స్థానికీకరణ అమలు..!!
- యూఏఈ లాటరీ Dh100-మిలియన్ల విజేత అనిల్‌కుమార్ బొల్లా..!!







