వినియోగదారుల రక్షణ అథారిటీ దాడులు.. 55 దుకాణాలకు నోటీసులు
- January 15, 2023
మస్కట్: అల్ బతినా నార్త్ గవర్నరేట్‌లో వినియోగదారుల రక్షణ అథారిటీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా 50కి పైగా వాణిజ్య దుకాణాలపై దాడులు నిర్వహించింది. పొగాకు, సిగరెట్లు, వాటి ఉత్పన్నాలను విక్రయించే దుకాణాలు, కిరాణా, ఇస్త్రీ దుకాణాలపై ఆకస్మిక తనిఖీ ప్రచారాన్ని కన్స్యూమర్ సర్వీసెస్, మార్కెట్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తర అల్ బతినా గవర్నరేట్‌లోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ నిర్వహించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన చట్టాలు, నిబంధనలు ఉల్లంఘించిన అనేక వస్తువులను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ క్యాంపెయిన్ నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని అన్ని విలాయత్‌లలో జరిగాయి. ఈ సందర్భంగా నమిలేపొగాకు, ఎలక్ట్రానిక్ సిగరెట్లు(144) స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 55 దుకాణాలకు నోటీసులు అందజేసినట్టు అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







