మొబైల్ డ్రైవింగ్ ఉల్లంఘనల గుర్తింపునకు కొత్త స్మార్ట్ కెమెరాలు

- January 15, 2023 , by Maagulf
మొబైల్ డ్రైవింగ్ ఉల్లంఘనల గుర్తింపునకు కొత్త స్మార్ట్ కెమెరాలు

కువైట్: కువైట్ రోడ్ల వెంబడి ఇటీవలే స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాలను ఏర్పాటు చేశామని, వీటితో వాహనదారుల భద్రత మరింత పెరిగిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ర్యాంకింగ్ అధికారి తెలిపారు. ఈ హై-సెన్సిటివిటీ కెమెరాలు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌ల వినియోగాన్ని గుర్తించగలవని రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ తౌహీద్ అల్-కందారి వెల్లడించారు. ప్రమాదాలకు ప్రధాన కారణాలపై వేగ పరిమితి, సిగ్నల్స్ ఉల్లంఘనలను కొత్త కెమెరాలు గుర్తిస్తాయన్నారు. ట్రాఫిక్ భద్రతను మెరుగుపరచడానికి, చట్టాన్ని ఉల్లంఘించే డ్రైవర్లను గుర్తించడానికి ఇటువంటి కెమెరాలను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. డ్రైవింగ్‌లో మొబైల్ సెట్‌ల అక్రమ వినియోగం, సీటు బెల్ట్‌ను ఉపయోగించకపోవడం, రాంగ్ డ్రైవింగ్, ప్రధాన రహదారులపై యూ టర్న్ వంటి వాటిని పర్యవేక్షించడానికి రోడ్లపై ఆ తరహా కెమెరాలను ఇన్‌స్టాల్ చేస్తున్నట్లు ఇటీవల అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.  2022లో జనవరి 1 నుంచి నవంబర్ చివరి వరకు ట్రాఫిక్ ఉల్లంఘనల మొత్తం 3.4 మిలియన్లకు చేరిందని మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాల కారణంగా 170 మంది మరణించారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com