ఫిబ్రవరి 1న ఆకాశంలో కనువిందు చేయనున్న ‘ఆకుపచ్చ తోకచుక్క’

- January 15, 2023 , by Maagulf
ఫిబ్రవరి 1న ఆకాశంలో కనువిందు చేయనున్న ‘ఆకుపచ్చ తోకచుక్క’

యూఏఈ: 50 సంవత్సరాలకు ఒకసారి కనిపించే అరుదైన ఆకుపచ్చ తోకచుక్క (కామెట్ 2022 E3 (ZTF)) మరోసారి వినువీధిలో కనువిందు చేయనుంది. ఫిబ్రవరి 1, 2023న దాదాపు 26 మిలియన్ మైళ్ల దూరంలో భూమికి దగ్గరగా వెళుతుందని, ఆ సమయంలో యూఏఈ నివాసితులు దాన్ని చూడవచ్చని దుబాయ్ ఆస్ట్రానమీ గ్రూప్ సీఈఓ హసన్ అల్ హరిరి తెలిపారు. పిభ్రవరి 5వ తేదీ వరకు ఆకుపచ్చ తోకచుక్కని ఆకాశంలో చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఇది కంటితో చూడగలిగేంత ప్రకాశవంతం కాకపోయినా బైనాక్యులర్లు, చిన్న టెలిస్కోప్‌లతో వీక్షించవచ్చని ఆయన చెప్పారు. దుబాయ్ ఖగోళ శాస్త్ర గ్రూప్ ఫిబ్రవరి 4, 2023న దుబాయ్‌లోని అల్ ఖుద్రా ఎడారిలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 9.30 వరకు ప్రత్యేక టిక్కెట్ ఈవెంట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఇందులో కామెట్, మూన్, మార్స్, జూపిటర్ మరియు డీప్ స్కై ఆబ్జెక్ట్స్ టెలిస్కోప్ పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ సెషన్‌లు, స్కై మ్యాపింగ్ ఉంటాయన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com