తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌ పై క్షిపణితో దాడి చేసిన రష్యా..

- January 15, 2023 , by Maagulf
తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌ పై క్షిపణితో దాడి చేసిన రష్యా..

రష్యా పై ఉక్రెయిన్ దాడులు కొనసాగుతున్నాయి. ఎత్తైన భవనాలు, విద్యుత్ కేంద్రాలపై రష్యా భీకర దాడులు చేస్తోంది. తాజాగా, ఉక్రెయిన్ లోని ఓ తొమ్మిది అంతస్తుల అపార్ట్‌మెంట్‌పై రష్యా దాడులు చేసింది. దీంతో ఆ అపార్ట్‌మెంట్‌ కుప్పకూలిపోయింది. 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డినిప్రొలో ఈ దాడి జరిగింది. రష్యా దాడిలో మరో 64 మంది గాయపడ్డారని, అలాగే, సహాయక బృందాలు మరో 37 మందిని రక్షించాయని ఉక్రెయిన్ పేర్కొంది. తాజా దాడి నేపథ్యంలో తమకు మరిన్ని ఆయుధాలు ఇవ్వాలని పశ్చిమ దేశాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు.

‘‘రష్యా దుందుడుకు చర్యలను ఆపడం ఇక సాధ్యం కాదా?’’ అని ఆయన ప్రశ్నించారు. మరోవైపు, ఉక్రెయిన్ కు 14 యుద్ధ ట్యాంకులు, ఇతర ఆయుధాలు పంపుతామని యూకే ప్రధాన మంత్రి రిషి సునక్ ప్రకటించారు. ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో కీలక ప్రదేశాలపై కూడా రష్యా దాడులు చేసింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ కేంద్రాలు ధ్వంసం కావడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది.

రష్యా చేసిన దాడులను ఖండిస్తున్నామని అమెరికా సహా పలు దేశాలు ప్రకటించాయి. ఉక్రెయిన్ భూభాగం తమదేనని వాదిస్తోన్న రష్యా దాన్ని స్వాధీనం చేసుకోవాడనికి కొన్ని నెలలుగా యుద్ధం చేస్తోంది. రష్యా దాడులను పశ్చిమ దేశాల సాయంతో ఉక్రెయిన్ ఎదుర్కొంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com