ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

- January 15, 2023 , by Maagulf
ఫిబ్రవరి 17న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం

హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయం 2023, ఫిబ్రవరి 17వ తేదీన ప్రారంభం కానుంది. సీఎం కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. 2019 జూన్ 27న నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్ భూమి పూజ చేశారు. ప్రస్తుతం నిర్మాణం పనులు పూర్తి కావచ్చాయి. తెలంగాణకు తలమానికంగా నిర్మాణం అవుతున్న కొత్త సచివాలయాన్ని రూ.610 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది.

నిజాం ప్రభుత్వం కట్టడాలను పోలిన నిర్మాణంలో న్యూ సెక్రటేరియట్ ను నిర్మిస్తున్నారు. 26.29 ఎకరాల్లో నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. 11.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో సెక్రటేరియట్ నిర్మిస్తున్నారు. 278 అడుగుల ఎత్తులో సచివాలయం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ తో కలిసి మొత్తం ఏడు ఫ్లోర్లతో నిర్మాణం జరుగుతోంది. రూఫ్ టాప్ లో ప్రత్యేక స్కై లాంజ్ ఉంటుంది.

పటిష్టమైన భద్రత, ఆహ్లాదం పంచే పార్కులతో సుందరంగా నిర్మిస్తున్నారు.ఆరో అంతస్తులో అత్యాధునిక హంగులతో సీఎం చాంబర్ ఉంటుంది.సీఎం కోసం ప్రత్యేక ద్వారం, స్పెషల్ లిఫ్ట్ ఉంటుంది. సందర్శకుల కోసం ప్రత్యేక వెయిటింగ్ హాల్ ఉంటుంది. 3 సంవత్సరాల 8 నెలల్లో సచివాలయం నిర్మాణం పూర్తైంది.  నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చింది.

వాస్తవానికి ఈరోజు సంక్రాంతి రోజు నూతన సచివాలయాన్ని భావించినప్పటికీ ఇంకా కొన్ని పనులు పెండింగ్ లో ఉండటం వల్ల సచివాలయ ప్రారంభాన్ని ఫిబ్రవరి 17కు వాయిదా వేశారు. అదే రోజు సీఎం కేసీఆర్ జన్మదినం ఉన్నందుకు ఆరోజే సచివాలయం ప్రారంభం కానుండటం ఆసక్తికర అంశంగా చెప్పవచ్చు.

కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ పేరును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త సచివాలయానికి అంబేద్కర్‌ పేరును ఖరారు చేస్తూ గురువారం(సెప్టెంబర్ 15,2022) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయానికి డాక్టర్‌ బీ.ఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంగా నామకరణం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్టస్‌ అధిపతి ఆస్కార్‌ జి.కాన్సెస్సో, పొన్ని జి.కాన్సెస్సో

భారత దేశంలోనే వేగంగా పురోగమిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయ నిర్మాణానికి డిజైన్‌ రూపొందించే అవకాశం రావటం చాలా గర్వంగా ఉందని డిజైన్‌ రూపొందించిన చెన్నైకు చెందిన ఆస్కార్‌ అండ్‌ పొన్ని ఆర్కిటెక్టస్‌ అధిపతి ఆస్కార్‌ జి.కాన్సెస్సో పేర్కొన్నారు. తన భార్య పొన్ని జి.కాన్సెస్సోతో కలిసి ఆయన ఈ సంస్థను నిర్వహిస్తున్నారు. వినూత్న నిర్మాణాలకు డిజైన్లు రూపొందించటంతో ఈ సంస్థ మంచి ఖ్యాతిని పొంది ఇప్పటి వరకు దాదాపు 100 కు పైగా పురస్కారాలు అందుకుంది.తాజాగా తెలంగాణ సచివాలయ నమూనా రూపొందించే కాంట్రాక్టును దక్కించుకుంది.

తిరిచురాపళ్లి నిట్‌లో ఈ దంపతులు బి.ఆర్క్‌ డిగ్రీ పొంది ఆ తర్వాత అమెరికాలో మాస్టర్స్‌ చేసి ఆర్కిటెక్ట్‌ సంస్థను ప్రారంభించారు. ‘తెలంగాణ రాష్ట్ర సచివాలయ భవనానికి డిజైన్‌ రూపొందించే అవకాశం మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌ లాంటి వారితో పోటీపడి అవకాశం దక్కించుకున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఆశించేస్థాయిలో డిజైన్లు అందించాం.పచ్చిక బయళ్లతో సహా కలిపి మొత్తం 15 డిజైన్లు ఇచ్చాం.వాటిని పరిశీలించి చివరకు అత్యద్భుత నమూనాను ఎంచుకున్నారు. పూర్తి ఆధునిక హంగులుంటాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com