మలేషియా ఆంధ్ర అసోసియేషన్ (MAA) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు
- January 15, 2023
కౌలాలంపూర్: మలేషియా ఆంధ్ర అసోసియేషన్ (MAA) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి, మలేషియా కౌలాలంపూర్ లోని డీ చక్ర రూఫ్ టాప్ హాల్, TLK కాంప్లెక్స్, బ్రిక్ ఫీల్డ్స్, కౌలాలంపూర్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సాంప్రదాయ దుస్తులతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ప్రవాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధిగా ఇండియన్ హై కమీషనర్ అఫ్ మలేషియా B.N రెడ్డి మరియు మలేషియా తెలుగు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సీతా రావు, మలేషియా తెలంగాణ అసోసియేషన్ డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, మలేషియా తెలుగు ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఇతర తెలుగు సంఘాల ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా నిర్వహించిన ఉత్సవాలలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల పాటలు నృత్యాలతో ఆడిటోరియం కళకళలాడింది అలాగే జబర్దస్త్ ఫేమ్ అశోక్ మరియు బాబీ పాల్గొని వారి హాస్యంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.రుచికరమయిన మన తెలుగు వంటకాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.అలాగే ముగ్గుల పోటీలు, లక్కీ కపుల్, క్యూట్ బేబీ కాంటెస్ట్, లక్కీ డ్రా నిర్వహించి బంగారు బహుమతులను అందజేశారు.
B.N రెడ్డి మాట్లాడుతూ విదేశీ గడ్డ పై ఇలాంటి పండుగలు నిర్వహిస్తూ తమ సంస్కృతి, సంస్కారాలను కాపాడుతూ నవతరాలకు చాటి చెబుతూన్న మా అసోసియేషన్ ను అయన అభినందించారు.ఈ సంక్రాంతి తెచ్చే సంబరాలలో ప్రతి ఇంట ఆనందాలు వెల్లి విరియాలని అయన ఆకాంక్షించారు.
మా ప్రెసిడెంట్ శ్రీ రామ్ మాట్లాడుతూ, మన దేశాన్ని దాటి ఎంత దూరం వచ్చినప్పటికి మన సంస్కృతి సంప్రదాయాలను మరిచిపోకుండా వాటిని కాపాడుతు రేపటి తరం పిల్లలకు తెలియచేయటం మన బాధ్యత అన్నారు అలాగే సంక్రాతి పండుగా గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమానికి స్పాన్సర్ గా వచ్చిన శ్రీ బిర్యానీ, టెక్ తీరా ,ఎస్.వి.ఐ టెక్నాలజీస్, ఆక్సీ డేటా, రెడ్ వేవ్, జాస్ ట్రేట్జ్,క్లబ్ మహీంద్రా ,మినీ మార్ట్ , మై టెక్ ,కానోపుస్, లు లు మనీ, ఈగల్ టెక్ ,నిమ్మల, మై 81,ఫ్యామిలీ గార్డెన్,దేశి తడ్కా,బిగ్ సి హైదరాబాద్,మై బిర్యానీ హౌస్,ప్రబలీస్ రెస్టారెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సంక్రాంతి సంబరాలను విజయవంతం కావడానికి సహకరించిన మా కోర్ కమిటీ ని వాలంటీర్లు గా ముందుకి వచ్చిన సభ్యులను, మరియు మా సభ్యులను అయన అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీరామ్ కోర్ కమిటీ సభ్యులు వెంకట్,శ్రీనివాస్ చౌటుపల్లి, నల్ల స్వామి నాయుడు ,జగదీష్ శ్రీరామ్ ,కిరణ్ గుత్తుల,రవి వంశి,శారద ,దీప్తి ,హరీష్ నడపన,రామ్ గొల్లపల్లి,గణేష్ ,కిషోర్,నాయుడు రావూరి,రవి జాస్,సందీప్ తన్నీరు,సతీష్ నంగేడా,కల్పనా , తదితరులు పాల్గొన్నారు.


తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు
- సౌదీలో సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ పునరుద్దరణ..!!
- కువైట్ లో బయటపడ్డ 4వేలఏళ్ల కిందటి దిల్మున్ నాగరికత..!!
- ముసన్నాలో డ్రగ్స్ తో దొరికిన ఆసియా ప్రవాసి..!!
- దుబాయ్లో 'ఎమిరేట్స్ లవ్స్ ఇండియా'..ఆకట్టుకున్న సాంస్కృతిక పరేడ్..!!
- ప్రపంచ పర్యాటక మ్యాపులో బహ్రెయిన్..!!
- అల్ వక్రా పోర్టులో అగ్నిప్రమాదం కేసులో ఇద్దరు అరెస్టు..!!
- కువైట్లోకి 90% తగ్గిన డ్రగ్స్ స్మగ్లింగ్..!!







