అబుధాబిలో గోల్డెన్ వీసా చెల్లుబాటు 10 సంవత్సరాలకు పెంపు
- January 16, 2023
యూఏఈ: అబుధాబిలో గోల్డెన్ వీసా వ్యవధి అన్ని వర్గాలకు 5 సంవత్సరాలకు బదులుగా 10 సంవత్సరాల కాలానికి అప్డేట్ చేయబడిందని అబుధాబి రెసిడెంట్స్ ఆఫీస్‌లోని ఆపరేషన్స్ డైరెక్టర్ మార్క్ డోర్జి తెలిపారు. ఈ వీసాను కలిగి ఉన్నవారు జీవిత భాగస్వాములు, పిల్లలు, తల్లిదండ్రులను వయస్సుతో నిమిత్తం లేకుండా స్పాన్సర్ చేయవచ్చన్నారు. గోల్డెన్ వీసా ఇప్పుడు పదేళ్లపాటు చెల్లుబాటవుతుందని అబుధాబి రెసిడెంట్స్ ఆఫీస్ సూచించింది. వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు వంటి సైన్స్, విజ్ఞాన రంగాలలో నిపుణులు, పరిశోధకుల కోసం విస్తృత శ్రేణి రెసిడెన్సీ ఎంపికలకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందని మార్క్ డోర్జి వెల్లడించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







