ఒమన్ లో ఇక ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాహన యాజమాన్యం బదిలీ

- January 16, 2023 , by Maagulf
ఒమన్ లో ఇక ఎలక్ట్రానిక్ పద్ధతిలో వాహన యాజమాన్యం బదిలీ

మస్కట్: తమ వెబ్ సైట్ ద్వారా వాహనాన్ని ఒక సంస్థ నుండి మరొక సంస్థకు లేదా ఒక వ్యక్తి నుంచి సంస్థకు ఎలక్ట్రానిక్‌గా బదిలీ చేసే అవకాశాన్ని ప్రవేశపెట్టినట్లు రాయల్ ఒమన్ పోలీస్ (ROP) వెల్లడించింది. ఈ మేరకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ ఆన్‌లైన్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. రవాణా నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలు, ప్రైవేట్-వాణిజ్య వాహనాలు, మోటార్ సైకిళ్లకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. అయితే కంపెనీలు, సంస్థలకు ఇది వాణిజ్య వాహనాలకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. రాయల్ ఒమన్ పోలీస్ వెబ్‌సైట్ (https://idpsp.rop.gov.om/login.jsp?app=VehicleOwnershipTransfer) ద్వారా ఈ సేవ అందుబాటులో ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ సూచించింది.

ఎలక్ట్రానిక్ బదిలీకి మార్గదర్శకాలు

1- వాహన లైసెన్స్ తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలి.

2- సివిల్ స్టేటస్ సిస్టమ్‌లో విక్రేత ఫోన్ నంబర్ (సర్టిఫైడ్) యాక్టివేట్ గా ఉందని నిర్ధారించుకోవాలి.

3- వాహన బీమా బదిలీ విధానాలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. 

4- సాంకేతిక పరీక్షలో వాహనాలు ఉత్తీర్ణత సాధించాలి.

5- ట్రాఫిక్ చట్టం నిబంధనలు, షరతులకు అనుగుణంగా లబ్ధిదారుల రికార్డులు, యాజమాన్యం బదిలీ చేయబడే వాహనంపై ఎలాంటి పరిమితులు ఉండకూడదు.

6- వాహనం బదిలీ చేయడానికి అభ్యర్థనను సమర్పించడం, ఆమోదంపై సంతకం చేయడం తప్పనిసరిగా విక్రేత వ్యక్తిగతంగా డిజిటల్ ధృవీకరణను ఉపయోగించాలి.

7. విక్రేత లావాదేవీని పూర్తి చేసిన 24 గంటలలోపు కొనుగోలుదారు తప్పనిసరిగా లావాదేవీ రుసుములను చెల్లించాలి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com