కువైట్ లో రాబోయే రెండు రోజులపాటు వర్షాలు!
- January 16, 2023
కువైట్: రాబోయే రెండు రోజులపాటు కువైట్ వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉన్నది. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు వర్షాలు కురుస్తాయని కువైట్ వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడనం కారణంగా తక్కువ, మధ్య స్థాయి మేఘాలు ఏర్పడతాయని పేర్కొంది. వీటి కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్త అబ్దుల్ అజీజ్ అల్-ఖరావి వెల్లడించారు. దేశంలోని దక్షిణ భాగంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అధిక గాలులతోపాటు తక్కువ దృశ్యమానత ఏర్పడే అవకాశం ఉందని, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ సూచనలు పాటించాలని అల్-ఖరావి సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అవయవ దాన సంస్కృతి ప్రోత్సహానికి అవేర్నేస్ కార్యక్రమాలు..!!
- 'బిగ్ టికెట్' ఈ-డ్రా: 1,00,000 దిర్హామ్‌లు గెలిచిన నలుగురు భారతీయులు..!!
- ఇరాన్ దాడుల పై ప్రశంసలు..జైలు శిక్ష ఖరారు..!!
- రియాద్ డ్రగ్ ట్రాఫికింగ్ నెట్‌వర్క్‌లో 22 మంది అరెస్ట్..!!
- 'సేవ్ బేబీ మియా' ప్రచారం ద్వారా రూ. 16.5 కోట్లు సమీకరణ..!!
- నంబర్ ప్లేట్ల వేలాన్ని ప్రకటించిన ఖతార్ ట్రాఫిక్ శాఖ..!!
- యూఏఈ లాటరీ..30 మిలియన్ దిర్హమ్ జాక్‌పాట్ గెలిచిన రెండవ విజేత..!!
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?







