దేశీయ యాత్రికుల కోటాపై హజ్ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

- January 16, 2023 , by Maagulf
దేశీయ యాత్రికుల కోటాపై హజ్ మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు

రియాద్ : ప్రస్తుతం సౌదీ అరేబియాలో నివసిస్తున్న జీసీసీ దేశాల హజ్ యాత్రికులు ఈ సంవత్సరం హజ్ సీజన్‌లో కంపెనీలు, దేశీయ యాత్రికుల సంస్థలకు కేటాయించిన సీట్లలో నమోదు చేసుకోలేరని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. గల్ఫ్ పౌరులు తమ దేశాల మిషన్ల ద్వారా హజ్ కోసం నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. ఈ సంవత్సరం హజ్ కోసం రిజిస్టర్ చేసుకోవడం కోసం సౌదీ ID లేదా చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ (ఇకామా) ఉన్న యాత్రికుల కోసం మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలని, ఇది ఈ నెల 17వ తేదీ(ధుల్ హిజ్జా 1444)తో ముగుస్తుందని తెలిపింది. గత సంవత్సరాల్లో హజ్ చేసిన యాత్రికులు ఈ సీజన్‌లో భర్తగా, సోదరుడిగా, తండ్రిగా లేదా కొడుకుగా స్త్రీల పురుషుల సంరక్షకులుగా (మహ్రమ్) నమోదు చేసుకోవచ్చన్నారు.  హజ్ యాత్రికులు రిజర్వేషన్ బుక్ చేసుకున్న తర్వాత హజ్ సౌకర్యాన్ని మార్చుకోలేరని మంత్రిత్వ శాఖ తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ప్యాకేజీల నుండి జంతు బలి (అదాహి, హదీ) కొనుగోలు ఆప్షన్ ని తొలగించినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com