ఇంటర్నెట్ బెగ్గింగ్, పాన్‌హ్యాండ్లింగ్‌పై హెచ్చరికలు జారీ

- January 16, 2023 , by Maagulf
ఇంటర్నెట్ బెగ్గింగ్, పాన్‌హ్యాండ్లింగ్‌పై హెచ్చరికలు జారీ

బహ్రెయిన్ : సైబర్-బిగ్గింగ్ లేదా ఇ-బిగ్గింగ్‌కు వ్యతిరేకంగా యాంటీ-కరప్షన్ అండ్ ఎకనామిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో నడిచే యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ పలు సూచనలు చేసింది. ఇ-బిగ్గింగ్‌ లేదా పాన్‌హ్యాండ్లింగ్ అనేది సాంప్రదాయ భిక్షాటన వర్చువల్ వెర్షన్ అని, ఆహారం, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలను తీర్చాలని అపరిచితులను డబ్బు అడుగుతారన్నారు. హృదయాన్ని కదిలించే కథనాలతో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు, ప్రచురణలు, చాట్‌రూమ్‌లలో పోస్టులు పెట్టడం ద్వారా ఆర్థిక సహాయం కోరే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. ఇలాంటి వారు ఆన్‌లైన్‌లో దుకాణాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారని, ఉత్పత్తులపై చెడు వ్యక్తిగత అనుభవాలతో సహా దుర్వినియోగ, ప్రతికూల వ్యాఖ్యలను పోస్ట్ చేస్తారన్నారు. వందలాది ఇంటర్నెట్ బెగ్గింగ్ సైట్‌లు ఆన్‌లైన్‌లో ఉన్నాయని వాటి పట్ట జాగ్రత్తగా ఉండాలన్నారు. మానవతావాద కార్డులను ప్లే చేయడం ద్వారా విరాళాలు, నిధులను సేకరించడానికి మీడియా ప్రచారాలు లేదా నెట్‌వర్కింగ్ సైట్‌ల మద్దతుతో వెబ్‌సైట్‌లు, ప్రైవేట్ ఫోన్ నంబర్‌లను నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వ్యక్తిగత డేటా, ఖాతాల వివరాలను తెలపొద్దని, ఇంటర్నెట్ లేదా స్మార్ట్‌ఫోన్ యాప్‌ల ద్వారా సహాయం లేదా డబ్బు కోసం చేసిన అభ్యర్థనలకు ఎప్పుడూ స్పందించవద్దని యాంటీ-సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. అలాంటి ప్రకటన గురించి డిపార్ట్‌మెంట్ హాట్‌లైన్ నంబర్ 992 ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. 2007 నాటి అక్రమార్కుల చట్టం నెం. (5) ప్రకారం భిక్షాటనను నేరంగా బహ్రెయిన్ పరిగణిస్తుంది. అక్రమాస్తుల చట్టంలోని ఆర్టికల్ 7 ప్రకారం..  భిక్షాటనకు పాల్పడే వారికి 1 సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా (50 -100 దినార్ల మధ్య) విధించే అవకాశం ఉన్నది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com