కుప్పకూలిన నేపాల్ విమాన బ్లాక్‌బాక్స్ లభ్యం
- January 16, 2023
నేపాల్‌లోని పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్ వే పై కుప్పకూలిన ఏటీఆర్ 72 విమాన బ్లాక్‌బాక్స్ లభ్యమైంది. దీంతో విమాన ప్రమాదం ఎలా జరిగిందన్న వివరాలు తెలిసే అవకాశం ఉంది. 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బందితో నిన్న కాఠ్మాండూ నుంచి పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో కుప్పకూలిన విషయం తెలిసిందే.
దీంతో ఇప్పటివరకు 68 మంది మృతదేహాలను సహాయక సిబ్బంది బయటకు తీశారు. విమాన ప్రమాదంలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమాన ప్రమాదంపై విచారణ ప్రారంభించిన అధికారులు ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఇవాళ బ్లాక్‌బాక్స్ గుర్తించామని కాఠ్మాండూ విమానాశ్రయ అధికారి షేర్ బహదూర్ ఠాకూర్ చెప్పారు.
విమానానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బ్లాక్‌బాక్స్ ప్రత్యేక ఆల్గారిథం ద్వారా రికార్డు చేస్తుంది. కాగా, నేటి తమ రెగ్యులర్ విమాన సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు యతి విమానయాన సంస్థ పేర్కొంది. కాగా, విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







