బహ్రెయిన్ లో ఎన్బీఆర్ డిజిటల్ స్టాంప్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభం
- January 16, 2023
మనామా: సిగరెట్ ఉత్పత్తులపై డిజిటల్ స్టాంపుల పథకం కింద స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారుల కోసం "NBR డిజిటల్ స్టాంప్" మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించినట్లు నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూ (NBR) ప్రకటించింది. ఉత్పత్తి ప్రామాణికమైనదని, ప్రదర్శించబడే సమాచారం ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిర్ధారించుకోవడానికి పొగాకు ఉత్పత్తులపై డిజిటల్ స్టాంప్ QR కోడ్‌ను స్కాన్ చేయడానికి ఇది వినియోగదారులను అనుమతిస్తుందన్నారు. డిజిటల్ స్టాంపుల పథకం డిజిటల్ స్టాంప్‌లోని భద్రతా లక్షణాలు, కోడ్‌ల ద్వారా ఎక్సైజ్ వస్తువులను తయారీ దశ నుండి వినియోగం వరకు ట్రాక్ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని నేషనల్ బ్యూరో తెలిపింది. ఈ ప్రక్రియ అమలుతో వస్తువుల అక్రమ రవాణా, నకిలీ లేదా చట్టవిరుద్ధ ఉత్పత్తుల చెలామణికి అడ్డుకట్ట పడుతుందని పేర్కొంది. స్థానిక మార్కెట్‌లో డిజిటల్ స్టాంప్ లేని పొగాకు ఉత్పత్తులపై విధించిన నిషేధం అక్టోబర్ 16, 2022 నుండి అమల్లోకి వచ్చింది. మొబైల్ అప్లికేషన్ ప్రస్తుతం ఆపిల్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్, ఎన్బీఆర్ వెబ్‌సైట్ http://www.nbr.gov.bh లో అందుబాటులో ఉందన్నారు.
తాజా వార్తలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత







