హైదరాబాద్‌లో కొత్త తరహా మోసం
- January 16, 2023
హైదరాబాద్: హైదరాబాద్ లో కొత్త తరహా దాడులు జరుగుతున్నాయి. ముందుగా హోమ్ డెలివరీ పేరుతో యువకులతో ఓ మహిళ పరిచయాలు పెంచుకుని ఫోటోలు దిగుతుంది. ఆ తర్వాత హనీ ట్రాప్ చేసి తన ముఠాతో ఫోటోలు దిగిన వారిపై దాడులు చేయిస్తోంది. ఫోటోలు దిగిన మరుసటి రోజు వారి ఇంటి ముందు ఆ మహిళ హల్ చల్ చేస్తుంది.
ఇప్పటికే కొంత మంది యువకులను బెదిరించి వారి నుంచి రూ.8లక్షలు వసూలు చేసింది. హైదరాబాద్ లో హనీట్రాప్ దాడులపై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఒక్కరోజే సెంట్రల్ జోన్ పరిధిలో 6 కేసులు నమోదయ్యాయి. హనీట్రాప్ కేసులు పెరిగిపోతుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
మోసాలకు పాల్పడుతున్న హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. హనీట్రాప్ కి పాల్పడ్డ మహిళ పరారీ కాగా, 12మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి లక్షన్నర రూపాయల నగదుతో పాటు 3 బైక్ లు, 12 ఫోన్లు, పది కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- జూలై 8 నుంచి మారనున్న విమాన సర్వీసులు
- శంషాబాద్ ఎయిర్పోర్టులో 20 మంది మహిళలు అరెస్ట్
- ప్రధాని మోదీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్ ఫౌండర్ మహమ్మద్ అలీ అలబ్బర్
- ఈ లవ్ ప్రమాదకరం..ఎంపైర్ స్టేట్ టవర్ ఎక్కి ఎంగేజ్మెంట్







