రాజగిరి పబ్లిక్ స్కూల్ 'ఎక్స్‌పో 2022' ప్రారంభం

- January 16, 2023 , by Maagulf
రాజగిరి పబ్లిక్ స్కూల్ \'ఎక్స్‌పో 2022\' ప్రారంభం

దోహా: విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, స్ఫూర్తిని పెంపొందించేందుకు, యువ ఆవిష్కర్తలుగా మలిచే లక్ష్యంతో దోహాలోని రాజగిరి పబ్లిక్ స్కూల్ (RPS) రాజగిరి ఎక్స్‌పో-2022 పేరిట సైన్స్ ఫెయిర్ ను నిర్వహిస్తుంది. దోహాలోని స్కాలర్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఆనంద్ విక్టర్ ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్‌పోను ప్రారంభించారు. ఈ ఎక్స్‌పో వల్ల విద్యార్థులు కొత్త రంగాల్లో తమ ప్రతిభను వెలికితీసేందుకు, తమలోని వనరులను వినియోగించుకునేందుకు ఇలాంటి ఎక్స్‌పోలు దోహదపడతాయని ఆనంద్ అన్నారు. అనంతరం విద్యార్థుల నమూనాలను పరిశీలించారు. ఇందులో 5వ తరగతి నుంచి 11వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 250 ఎగ్జిబిట్‌లను నాలుగు వర్కింగ్ మోడల్స్ గా విభజించి ప్రదర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com