63% తగ్గిన విదేశీ యాత్రికుల ఉమ్రా బీమా ధర

- January 17, 2023 , by Maagulf
63% తగ్గిన విదేశీ యాత్రికుల ఉమ్రా బీమా ధర

రియాద్: 2023 జనవరి 10 నుండి విదేశీ ఉమ్రా ప్రదర్శకులకు సమగ్ర బీమా ధర 63 శాతం తగ్గి SR235 నుండి SR87కి తగ్గినట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఉమ్రా కోసం బీమా పాలసీ అత్యవసరమని, ఇది వీసాలో భాగం అన్నారు. ఉమ్రా సమయంలో చికిత్స, అడ్మిషన్, ఆసుపత్రిలో చేరడం, గర్భం, అత్యవసర ప్రసవం, అత్యవసర దంత కేసులు, ట్రాఫిక్ ప్రమాదాల గాయాలు, డయాలసిస్ కేసులు, అంతర్గత-బాహ్య వైద్య తరలింపు వంటి అత్యవసర కేసులను కవర్ చేస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే ఇది ప్రమాదవశాత్తు శాశ్వత పూర్తి వైకల్యం, ప్రకృతి వైపరీత్యాల కారణంగా మరణించిన కేసులు, మరణించిన వ్యక్తి మృతదేహాన్ని అతని దేశానికి తరలించడం, కోర్టు తీర్పు ద్వారా జారీ చేయబడిన బ్లడ్ మనీ వంటి సాధారణ కేసులను కూడా కవర్ చేస్తుందని పేర్కొంది. ఈ బీమా పరిధిలో విమాన ఆలస్యం పరిహారం, విమాన రద్దు పరిహారం పొందే ఆప్షన్లు కూడా ఉన్నాయన్నారు. రాజ్యంలోకి ప్రవేశించిన రోజు నుండి బీమా కవరేజీ వ్యవధి 90 రోజులు ఉంటుందని, దీని కవరేజీ పరిధి సౌదీ అరేబియాలో మాత్రమే ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com