30వేల మార్కును దాటిన బంగారం ధర
- April 29, 2016
30వేల మార్కును దాటిన బంగారం ధర ఇటీవల బంగారం వర్తకుల సమ్మె కారణంగా దిగొచ్చిన పసిడి ధర.. మళ్లీ పైపైకి పోతోంది. వరుసగా మూడో రోజు బంగారం ధర పెరగడంతో రెండేళ్ల గరిష్ఠానికి చేరి.. రూ. 30వేల మార్కును దాటేసింది. శుక్రవారం ఒక్కరోజే రూ. 350 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ. 30,250కి చేరింది. పెళ్లిళ్ల సీజన్‌తో కొనుగోళ్లు ఎక్కువవడంతో ధరలు పెరిగినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయంగా సింగపూర్ బులియన్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,274.24 డాలర్లుగా ఉంది.బంగారం దారిలోనే వెండి.. వెండి కూడా బంగారం దారిలోనే పయనించింది. రూ. 600 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 41,600కి చేరింది. సింగపూర్ మార్కెట్లో ఔన్సు వెండి ధర 17.84 డాలర్లుగా ఉంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







