కార్ల డీలర్షిప్ డాలర్లు సంపాదిస్తున్నా ఉగ్రవాదులు..
- April 29, 2016
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చేపలు అమ్మి డబ్బు సంపాదిస్తున్నారట. కాస్తో కూస్తో కాదండోయ్ చేపల వ్యాపారంతో ఉగ్రవాదులు మిలియన్ల డాలర్ల డబ్బు కూడబెడుతున్నారు. ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు చమురు కేంద్రాలపై చాలా డబ్బు సంపాదించేవారు. అయితే ఇటీవల అమెరికా ఆధ్వర్యంలోని సేనలు చమురు కేంద్రాల లక్ష్యంగా వైమానిక దాడులు చేసిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల చమురుకేంద్రాలను ఉగ్రవాదుల ఆధీనం నుంచి సైన్యం లాగేసుకుంది. దీంతో వారు డబ్బు సంపాదించడానికి వేరే మార్గాలు చూసుకుంటున్నారు. చేపలు అమ్మడంతో పాటు కార్ల డీలర్‌షిప్‌లు, ఫ్యాక్టరీల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్లు ఇరాక్ అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లోని వందలాది సరస్సులు, చేపల చెరువుల్లోని చేపలు అమ్మి మిలియన్ల డాలర్లు సంపాదిస్తున్నారు. చేపలు పెంచే వారి వద్ద నుంచి చెరువులు లాక్కుంటున్నారు. కొందరు యజమానులు చెరువులను వదిలేసి పారిపోగా, కొందరు చంపేస్తారేమోనని భయంతో ఉగ్రవాదులకు సహకరిస్తున్నారు. 2007 నుంచే ఉగ్రవాదులకు చేపల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం అందుతోంది. వీటితో పాటు ఉగ్రవాదులు కార్ల డీలర్షిప్ తీసుకుంటున్నారు. వారి ఆధీనంలో ఉన్న మౌసుల్ తదితర నగరాల్లో ప్రభుత్వ ఫ్యాక్టరీలను కూడా నడిపించి డబ్బు సంపాదిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







